In a shocking case, Telangana Rashtra Samithi leader Srinivas Reddy was caught on camera and mercilessly beating his wife after she raised questions about Reddy's marriage to another girl, without seeking a divorce.
రెండో భార్య సంగీతను కొట్టిన టీఆర్ఎస్ యువ నాయకుడు శ్రీనివాస్ రెడ్డిని (32) మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతనిని కోర్టు ఎదుట హాజరుపరిచి, అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
శ్రీనివాస్ రెడ్డికి కొన్నేళ్ల క్రితం స్వాతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా వేధించాడని తెలుస్తోంది. ఆయన తిరుగుళ్లు, వేధింపులు భరించలేక ఆమె విడాకులు తీసుకుంది. రూ.5 కోట్ల మొత్తం ఇచ్చి అతను విడాకులు తీసుకున్నాడని తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డికి తల్లిదండ్రుల నుంచి ఆస్తి వచ్చింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌లోను బాగా సంపాదించాడు.ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి నాలుగేళ్ల క్రితం సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా వేధించాడు. రెండేళ్ల క్రితం వారికి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని ఆమెను వద్దన్నాడు. దీనిపై ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఏడాదిన్నరగా వేరుగా ఉంటున్నారు.